మెహదీపట్నం, మెహదీపట్నం (రాజకీయ ప్రభంజనం) అక్టోబర్ 05
మెహదీపట్నం జీహెచ్ఎంసీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిర్మాణ అనుమతుల వ్యవహారంలో రూ.4 లక్షలు లంచం తీసుకుంటున్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సునీతను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మెహదీపట్నం జీహెచ్ఎంసీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సునీత రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
నిర్మాణ అనుమతులు, క్లియరెన్స్‌లకు సంబంధించిన వ్యవహారంలో లంచం డిమాండ్ చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్ని ఆమెను పట్టుకున్నారు.
ఒక నిర్మాణ భవనానికి సంబంధించిన అనుమతుల విషయంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సునీత రూ.8 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా మొదటి విడతగా రూ.4 లక్షలు తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లంచం మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
సునీతను అదుపులోకి తీసుకున్న అనంతరం మెహదీపట్నం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సంబంధిత ఫైళ్లు, పత్రాలు, రికార్డులను పరిశీలించిన అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.











