హైదరాబాద్: ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్యపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఆయనపై వచ్చిన అవినీతి, అక్రమ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. పోలీసు వర్గాల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్యను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆయనపై పలు అవినీతి, అక్రమ ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఆరోపణలపై శాఖాపరమైన విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.
ఆసుపత్రి నుంచి విధుల్లో చేరిన వెంటనే చర్యలు
కొన్ని రోజుల క్రితం సస్పెన్షన్ తప్పదన్న సమయంలో కృష్ణయ్య ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి విధుల్లో చేరిన వెంటనే ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు. ఈ పరిణామం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.












