పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ నిరంతర ప్రజాసేవను సీఎం ప్రశంసించారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఆరెకపూడి గాంధీకి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేస్తూ మరిన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా, సంతోషంగా గడపాలని ఆయన అభిలషించారు.






