హైదరాబాద్, 2026-11-21
తెలంగాణలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన శనివారం తెలంగాణ శాసనసభలో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో ఎస్టీ రిజర్వేషన్ల అమలు, పోడు భూముల సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.
తెలంగాణలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు సంబంధించిన పలు కీలక అంశాలపై పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన శనివారం తెలంగాణ శాసనసభలో కమిటీ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ భవనంలోని మీటింగ్ హాల్ నంబర్1లో జరిగిన ఈ సమావేశంలో అటవీ, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి () శాఖలకు సంబంధించిన అంశాలపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, పదోన్నతుల్లో గిరిజనులకు అమలవుతున్న 10 శాతం ఎస్టీ రిజర్వేషన్లు, రోస్టర్ విధానం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తీరుపై చర్చించారు. శాఖల వారీగా రిజర్వేషన్ల అమలు పరిస్థితులను పరిశీలించారు. అదేవిధంగా, గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, అటవీరెవెన్యూ శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. గిరిజనుల భూమి హక్కులకు భంగం కలగకుండా, వారికి రాజ్యాంగబద్ధమైన హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత శాఖల పనితీరును కమిటీ సమీక్షించింది.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు నేనావత్ బాలు నాయక్, డాక్టర్ మురళీ నాయక్ భూక్యా, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీలు పింగళి శ్రీపాల్ రెడ్డి, కేతావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ప్రత్యేక కార్యదర్శి బి.ఎం. సంతోష్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ లోకేష్ కుమార్, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సునీత భగవత్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి, డిప్యూటీ సెక్రటరీ, ఇతర అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. గిరిజనుల సంక్షేమం, ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు, పోడు భూముల సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో కమిటీ విస్తృతంగా సమీక్ష నిర్వహించింది.



