సింగరేణి, తెలంగాణ (రాజకీయ ప్రభంజనం) అక్టోబర్ 05
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. ఒక్కో ఉద్యోగికి రూ.1,10,250 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. ఒక్కో ఉద్యోగికి రూ.1,10,250 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సంస్థ భవిష్యత్తు కోసం యాజమాన్యం, కార్మికులు మరింత సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి కూడా బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాలని ఆయన సూచించారు.
సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశ ప్రగతిలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి మరింత కీలకపాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.60 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.
సింగరేణి కార్మికులకు ముందస్తు దసరా, దీపావళి శుభాకాంక్షలను కిషన్ రెడ్డి తెలియజేశారు.