జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు రెండో రోజు అదరగొట్టారు. షూటింగ్లో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాంశు ధిల్లాన్ రజతం, రుద్రాంక్ష్ పాటిల్ కాంస్యం సాధించారు. మహిళల 60 కిలోల మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో సుచికా తరివాల్ కాంస్యం గెలుచుకున్నారు.
జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు రెండో రోజు అదరగొడుతున్నారు. షూటింగ్లో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాంశు ధిల్లాన్ రజతం, రుద్రాంక్ష్ పాటిల్ కాంస్యం సాధించారు. అంతకుముందు వీరిద్దరూ, పార్థ్ మానే కలిసి ఇదే విభాగంలో జట్టు పోటీలో భారత్‌కు రజత పతకం అందించారు.
మహిళల 60 కిలోల సంప్రదాయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో సుచికా తరివాల్ కాంస్య పతకం సాధించారు. దీంతో ఉదయం వరకే భారత్ ఖాతాలో పతకాల సంఖ్య ఆరుకు చేరింది.
షూటింగ్లో భారత షూటర్ల సత్తా
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్లో చైనాకు చెందిన షెంగ్ లిహావో స్వర్ణం సాధించగా, హిమాంశు ధిల్లాన్ 252.4 పాయింట్లతో రజతం, రుద్రాంక్ష్ పాటిల్ 230.9 పాయింట్లతో కాంస్యం సాధించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఎలవెనిల్ వలరివన్ కూడా భారత్‌కు మరో రజతం అందించారు.
కబడ్డీలో భారత్ ఘన విజయం
పురుషుల కబడ్డీ గ్రూప్ దశలో భారత్ జపాన్‌పై 4924 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో టైటిల్‌ను కాపాడుకునే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఇది కీలక ఆరంభం.
ఇతర క్రీడల్లో పోటీ
భారత మహిళల హాకీ జట్టు ఇండోనేషియాతో తలపడుతోంది. తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌పై భారత్ 190తో భారీ విజయం సాధించింది. బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్‌తో పోటీపడగా, టేబుల్ టెన్నిస్‌లో భారత్పాకిస్థాన్ మ్యాచ్ కూడా షెడ్యూల్లో ఉంది. భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు సింగపూర్‌పై 32తో విజయం సాధించింది. మరోవైపు పురుషుల జట్టు ఇరాన్ చేతిలో 03తో ఓటమిపాలైంది.
ప్రస్తుతం భారత్ ఖాతాలో 6 పతకాలు (4 రజతాలు, 2 కాంస్యాలు) ఉన్నాయి. చైనా పతకాల పట్టికలో ముందంజలో ఉండగా, ఆతిథ్య జపాన్, దక్షిణ కొరియా తర్వాత భారత్ 10వ స్థానంలో ఉంది.
2026 ఆసియా క్రీడలు నుంచి వరకు ఐచినాగోయాలో జరుగుతున్నాయి. ఈసారి భారత్ తరఫున 499 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు.

