మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తూ, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని పాయం వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. మంత్రి ప్రజలకు మరింత సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని పేర్కొన్నారు. ఈ జన్మదిన జిల్లా ప్రధాన కార్యదర్శి పోలమూరి రాజు, మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్, పట్టణ అధ్యక్షుడు కురం రవి ముదిరాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా అధ్యక్షురాలు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










