ప్రస్తుతం భారతదేశం తన ఇంధన భద్రత కోసం కేవలం ముడి చమురు నిల్వలపైనే ఆధారపడుతోంది.
ప్రస్తుతం భారతదేశం తన ఇంధన భద్రత కోసం కేవలం ముడి చమురు నిల్వలపైనే ఆధారపడుతోంది. అయితే, సహజ వాయువు, ఎల్పీజీ వంటి ఇంధనాల దిగుమతులకు పరిమిత వనరులే అందుబాటులో ఉన్నాయని, అంతర్జాతీయ పరిణామాల వల్ల సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే దేశీయంగా తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ () టెర్మినళ్లు, ట్యాంకులు, పైప్లైన్ల ద్వారా నిల్వ చేసుకునే సామర్థ్యం సరిపోదని, దేశ అవసరాలకు అనుగుణంగా భూగర్భంలో ప్రత్యేక గ్యాస్ నిల్వ కేంద్రాలను అభివృద్ధి చేయాలని మనస్ మజుందార్ సూచించారు. ఇది దీర్ఘకాలికంగా ఇంధన భద్రతను పెంపొందించడానికి దోహదపడుతుంది.
చైనా, అమెరికా, జర్మనీతో పాటు యూరప్‌లోని అనేక దేశాలు ఇప్పటికే సమర్థవంతమైన దీర్ఘకాలిక ఇంధన నిల్వ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ దేశాల అనుభవాలను అధ్యయనం చేసి, భారతదేశం కూడా తగిన మౌలిక సదుపాయాలను నిర్మించుకోవాలని ఆయన సూచించారు.
అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడినప్పుడు లేదా సరఫరాలో ఆటంకాలు తలెత్తినప్పుడు, ఈ వ్యూహాత్మక నిల్వలు దేశీయ వినియోగదారులకు రక్షణ కవచంగా నిలుస్తాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి భరోసా లభిస్తుంది.

