ఎల్నినో కారణంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర రైతాంగంతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రకృతి ప్రకోపించడంతో తలెత్తిన ఈ విపత్తును ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలని కోరారు.
ఎల్నినో కారణంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర రైతాంగంతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రకృతి ప్రకోపించడంతో తలెత్తిన ఈ విపత్తును ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలని కోరారు.
ఎల్నినో వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై దసరా పండుగ తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పరిస్థితి తీవ్రతపై ఆ సమావేశంలో అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు.
ఆ తర్వాత నవంబర్ మొదటి వారంలో అఖిలపక్ష ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసి సహకారం కోరుతామని చెప్పారు. ఈ సంక్షోభ కాలం నుంచి గట్టెక్కడానికి తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి అన్ని శాఖలను అప్రమత్తం చేశారు.
ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమై ఎల్నినో ప్రభావం, వర్షాభావం, సాగు, తాగునీటి ఎద్దడి, తద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల రావుతో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎల్నినో కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవలసిన చర్యలపై ప్రణాళికల గురించి ముఖ్యమంత్రి వివరించి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రైతులు పెద్ద మనసుతో ఎండాకాలం పంటలు వేయడం తగ్గించుకోవాలి. ఒక సీజన్ పంట పండించే పనులను వాయిదా వేసుకొని, ఉన్న నీటిని తాగడానికి వినియోగించుకోవాలి.
ఎల్నినోను ఎదుర్కోవడానికి ప్రజలకు అండగా నిలబడాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, తప్పుడు ప్రచారం నమ్మి వరి పంటలు వేస్తే నీరు అందించలేక పంటలు ఎండిపోయి పెట్టుబడి నష్టపోవడమే కాకుండా మోటార్లు, మీటర్లు కాలిపోయే పరిస్థితులు తలెత్తుతాయి. పెద్ద మనసుతో ఒక సీజన్ను వాయిదా వేసుకోవాలి.
రైతులతో పాటు ఈ సంక్షోభ పరిస్థితుల్లో భూమిలేని నిరుపేద కూలీలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి 2.5 లక్షల మంది ఉపాధి హామీ కూలీ పనులకు వస్తున్నారు. ఉపాధి హామీ పనుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రికి సూచించడం జరిగింది.
ప్రస్తుత కాలంలో పంట నష్టపోయిన వారికి, ఎండాకాలంలో వాయిదా వేసుకునే పంట నష్టానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుల నిధి నుంచి సహకారం అందించాలి.












