మానుగూరు, 21 July
మణుగూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా నియమితులైన కురం రవి ముదిరాజ్‌ను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి చేసిన సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.
మణుగూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన కురం రవి ముదిరాజ్‌కు మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన సన్మానం జరిగింది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మణుగూరు యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు మర్రి శ్రీనివాస్, గుండు మల్లేష్లు కురం రవికి శాలువా కప్పి, కేక్ కట్ చేయించి, మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కురం రవి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తి అని కొనియాడారు. యువజన కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడిగా ఎంతో క్రియాశీలకంగా పార్టీలో చురుకుగా పనిచేశారని, పదవి ఉన్నా లేకపోయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి, పార్టీ కార్యక్రమాల్లో ముందంజలో ఉండేవారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి ఎప్పటికైనా ఫలితం లభిస్తుందని, అతని కష్టపడే తత్వాన్ని గుర్తించి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అతనికి సముచిత స్థానం కల్పిస్తూ మణుగూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు.
కురం రవి ఇక ముందు కూడా ఇలాగే కష్టపడుతూ పార్టీకి మరిన్ని సేవలు అందించి, ముందు ముందు ఇంకా ఉన్నత పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










