భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.
విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని విశ్వసించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, ప్రతి ఒక్కరికీ సమాన విద్యావకాశాలు కల్పించడం, సామాజిక న్యాయం, మతసామరస్యం, సమాన హక్కుల సాధన కోసం విశేష కృషి చేశారని పేర్కొన్నారు.
మౌలానా అబుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, విద్య ద్వారా సమాన అవకాశాలు కల్పించడం, సామాజిక సమానత్వం, సమగ్ర అభివృద్ధిని సాధించడం మనందరి బాధ్యత అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

