మీ పేరు, ఆధార్ లేదా ఇతర గుర్తింపు వివరాలను ఉపయోగించి మీకు తెలియకుండానే మరో మొబైల్ సిమ్ తీసుకున్నారా అలాంటి నంబర్‌ను సైబర్ నేరాలకు ఉపయోగిస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని రాజస్థాన్ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం ప్రజలను అప్రమత్తం చేసింది. మీ పేరుతో ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సంచార్ సాథి పోర్టల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
టెలికాం శాఖకు చెందిన ఈ సేవ ద్వారా మీ పేరుతో ఉన్న అనుమానాస్పద లేదా అవసరం లేని కనెక్షన్లను నివేదించి, డిస్కనెక్ట్ చేయమని కోరవచ్చు. దీనికోసం సంచార్ సాథి పోర్టల్‌ను సందర్శించి, అనే ఎంపికను ఎంచుకోవాలి.
మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, వచ్చిన ఓటీపీతో ధృవీకరించాలి. ఆ తర్వాత మీ పేరుతో నమోదైన మొబైల్ నంబర్ల జాబితా కనిపిస్తుంది. అందులో మీకు తెలియని నంబర్ ఏదైనా ఉంటే, దానిని పోర్టల్‌లోనే / చేయవచ్చు.
దొంగిలించిన గుర్తింపు పత్రాలు, ఫొటోలు లేదా బయోమెట్రిక్ సమాచారంతో నకిలీ ఈ-కేవైసీ ద్వారా సిమ్ తీసుకునే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ సిమ్‌ను ఆన్లైన్ చెల్లింపులు, బ్యాంకు ఖాతాలు లేదా సైబర్ మోసాలకు ఉపయోగించవచ్చు. అలాంటి నంబర్ మీ పేరుతో ఉంటే, మీకు తెలియకపోయినా దర్యాప్తులో మీ పేరు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది.
వెంటనే సంచార్ సాథి పోర్టల్ ద్వారా నివేదించడంతో పాటు సంబంధిత టెలికాం సంస్థను సంప్రదించాలి. సైబర్ మోసం జరిగినట్లు అనుమానం ఉంటే, అందుకు సంబంధించిన సందేశాలు, స్క్రీన్షాట్లు, ఈమెయిల్స్, చెల్లింపు వివరాలు వంటి ఆధారాలను సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
సిమ్‌ను అధికారిక టెలికాం కేంద్రం నుంచే తీసుకోవాలి. ఓటీపీ, పిన్, ఇతర రహస్య వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. ఆధార్, పాన్ వంటి పత్రాలను అనవసరంగా ఇతరులకు ఇవ్వకూడదు. మీ పేరుతో ఉన్న మొబైల్ కనెక్షన్లను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. మొబైల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లను నిర్లక్ష్యం చేయకూడదు.


