పినపాక మండలంలోని సీతంపేట గ్రామపంచాయతీ నుండి మణుగూరు మండలంలోని సమితిసింగారం గ్రామపంచాయతీకి పంచాయతీ కార్యదర్శిగా బదిలీ అయిన జె. అశోక్, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మణుగూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జె. అశోక్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు పుష్పగుచ్ఛం అందజేసి, నూతన బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరువురు పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గ్రామస్థాయిలో ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరవేయడంలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
సమితిసింగారం గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, గ్రామాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అర్హ లబ్ధిదారునికి చేరేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, సమితి సింగారం సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, కూనవరం ఉపసర్పంచ్ కొటుం మనోజ్ కుమార్, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, కాంగ్రెస్ నాయకులు మధు, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.








