ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి చెన్నైలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. తమ బంధువు వైఎస్ అనిల్‌రెడ్డి కుమార్తె శ్రేయ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన భార్య వైఎస్ భారతితో కలిసి చెన్నైలో జరిగిన వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. తన బంధువు, రాజకీయ నాయకుడు వైఎస్ అనిల్‌రెడ్డి కుమార్తె శ్రేయ వివాహ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులు శ్రేయ, ఉజ్వల్‌ను ఆశీర్వదించారు. వారికి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. న చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో జరిగిన ఈ వేడుకకు వైఎస్ జగన్, భారతి దంపతులతో పాటు వైఎస్ విజయమ్మ కూడా హాజరయ్యారు.
ఈ వివాహ రిసెప్షన్‌కు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరుకావడం విశేషం. తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్, నటి త్రిష, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయ్, జగన్ పరస్పరం పలకరించుకోవడం, ప్రముఖులు నూతన దంపతులతో ఫొటోలు దిగడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వివాహ వేడుకలో పాల్గొన్న ప్రముఖుల కలయిక అందరి దృష్టిని ఆకర్షించింది.




