అమెరికా అంతరిక్ష దళం కోసం స్పేస్ఎక్స్ రహస్య ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ అంతరిక్ష దళ స్థావరం నుంచి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.48 గంటలకు ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగానికి యూఎస్ఎస్ఎఫ్-432 (-432) అని పేరు పెట్టారు.
అమెరికా సైనిక అవసరాల కోసం చేపట్టిన ఈ ప్రయోగంలో ఏ ఉపగ్రహాలను పంపించారనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. అయితే, స్టార్‌షీల్డ్ వ్యవస్థ ఆధారంగా రూపొందించిన సైనిక ఉపగ్రహాల సమూహాన్ని తక్కువ భూ కక్ష్యలోకి పంపించి ఉండవచ్చని అంతరిక్ష పరిశోధకులు అంచనా వేస్తున్నారు. రాకెట్ మొదటి దశ ప్రయోగం అనంతరం తిరిగి భూమికి చేరుకుని, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఆఫ్ కోర్స్ ఐ స్టిల్ లవ్ యూ అనే డ్రోన్ నౌకపై విజయవంతంగా దిగింది. ఈ బూస్టర్‌ను ఎనిమిదోసారి ప్రయోగానికి ఉపయోగించడం విశేషం. ఈ ఏడాది స్పేస్ఎక్స్ చేపట్టిన 125వ ప్రయోగం కాగా, ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నిర్వహించిన 119వ ప్రయోగం ఇది.











