రైస్‌మిల్లుల పేరుతో బ్యాంకు రుణాలు తీసుకుని నిధులను మళ్లించారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం రూ.18.33 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసు కల్లం మోడర్న్ రైస్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతర సంస్థలకు సంబంధించినదిగా ఈడీ వెల్లడించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ప్రస్తుతం ఎస్బీఐలో విలీనం) గుంటూరులోని అరండల్‌పేట శాఖ నుంచి 20102013 మధ్య ఈ సంస్థలు రూ.24.57 కోట్ల రుణ సదుపాయాలు పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రుణాలకు హామీగా సమర్పించిన ఆస్తి పత్రాలు నకిలీవని, రుణాల ద్వారా పొందిన మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించారని ఈడీ ఆరోపించింది. దీనివల్ల బ్యాంకుకు రూ.18.33 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.
26 సంస్థల పేర్లతో కార్యకలాపాలు
కల్లం పేరి రెడ్డి తన బంధువులు, ఉద్యోగులు, అనుబంధ వ్యక్తుల పేర్లపై సుమారు 26 సంస్థలను నిర్వహించినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించిందని తెలిపింది. వీటిలో రుణాలు పొందిన మూడు సంస్థలు కూడా ఉన్నాయని పేర్కొంది.
మూడు సంస్థల క్రెడిట్ ఖాతాల నుంచి సుమారు రూ.23.81 కోట్ల నగదును కార్మికులు, అకౌంటెంట్లు, పేరి రెడ్డి పేర్లతో ఉపసంహరించినట్లు బ్యాంకు ఖాతాల పరిశీలనలో గుర్తించినట్లు ఈడీ వెల్లడించింది.
55 ఆస్తులు తాత్కాలిక జప్తు
ఈ రుణాల ద్వారా వచ్చిన నిధులతో కొన్ని ఆస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆస్తులను బంధువులు, అనుబంధ వ్యక్తుల పేర్లకు బదిలీ చేసినప్పటికీ, వాటిపై అసలు నియంత్రణ పేరి రెడ్డిదేనని ఈడీ ఆరోపించింది. దీంతో 50 స్థిరాస్తుల విలువ రూ.16.38 కోట్లు, ఐదు ఫ్లాట్ల విలువ రూ.1.45 కోట్లుగా లెక్కించి మొత్తం రూ.18.33 కోట్ల ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ తెలిపింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.18.33 కోట్ల విలువైన 55 స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. రైస్‌మిల్లుల పేరుతో నకిలీ ఆస్తి పత్రాలు సమర్పించి, రూ.24.57 కోట్ల రుణాలు పొంది, నిధులను మళ్లించి బ్యాంకుకు నష్టం కలిగించినట్లు ఈడీ ఆరోపించింది.
తరచుగా అడిగే ప్రశ్నలు
ఈడీ ఏయే రాష్ట్రాల్లో ఆస్తులను జప్తు చేసింది?
ఈడీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆస్తులను జప్తు చేసింది.
ఎన్ని ఆస్తులను జప్తు చేశారు?
మొత్తం 55 స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు.
బ్యాంకు మోసానికి సంబంధించిన మొత్తం రుణం ఎంత?
నకిలీ పత్రాలతో రూ.24.57 కోట్ల రుణాలు పొందినట్లు ఆరోపణలున్నాయి.

