తమిళ యువ దర్శకుడు, నటుడు అభిషన్ జీవింత్ ఇంట్లో సంతోషం నెలకొంది. ఆయన భార్య అఖిల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను అభిషన్ న సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అభిషన్ తన చేతుల్లో అప్పుడే పుట్టిన చిన్నారిని పట్టుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అధికారికంగా ఆడబిడ్డకు తండ్రినయ్యాను అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇటీవలే తొలి పెళ్లిరోజు
అభిషన్ జీవింత్, అఖిల గత ఏడాది అక్టోబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరూ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. చెన్నైలోని హను రెడ్డి పోయెస్ గార్డెన్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరిగింది. అనంతరం గ్రీన్ పార్క్ హోటల్లో జరిగిన రిసెప్షన్‌కు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవలే ఈ జంట తమ మొదటి పెళ్లిరోజును జరుపుకుంది. పెళ్లిరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా అభిషన్ పంచుకున్నారు. ఆ వేడుక జరిగిన కొద్ది రోజులకే తమకు పాప పుట్టిన విషయాన్ని వెల్లడించారు.
టూరిస్ట్ ఫ్యామిలీతో గుర్తింపు
2025లో విడుదలైన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో అభిషన్ దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఈ చిత్రంలో కీలక పాత్రలోనూ నటించారు. శ్రీలంక నుంచి చెన్నైకి వచ్చిన ఒక కుటుంబం ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందడంతో అభిషన్‌కు దర్శకుడిగా పేరు వచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన విత్ లవ్ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఇందులో అనస్వర రాజన్ ఆయనకు జోడీగా నటించారు.
ప్రస్తుతం గౌతమ్ శివరామన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పికాసో సినిమాలో శివరాజ్‌కుమార్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుగన్ అనే పాత్రలో కనిపించనున్నారు.






