పపువా న్యూ గినియాలోని సెపిక్ నదిలో దాదాపు 40 ఏళ్లుగా శాస్త్రీయ రికార్డుల్లో కనిపించని అరుదైన మంచినీటి చేప స్పినాక్ పైప్ఫిష్ ( ) మళ్లీ కనిపించింది. 1985 తర్వాత ఈ చేపను గుర్తించడం శాస్త్రవేత్తలలో ఆసక్తిని రేకెత్తించింది.
పపువా న్యూ గినియాలో దాదాపు 40 ఏళ్లుగా శాస్త్రీయ రికార్డుల్లో కనిపించని అరుదైన మంచినీటి చేప మళ్లీ వెలుగులోకి వచ్చింది. స్పినాక్ పైప్ఫిష్ ( )గా పిలిచే ఈ చేపను చివరిసారిగా 1985లో శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా సెపిక్ నదిలో ఈ చేపను గుర్తించడం విశేషంగా మారింది.
స్థానిక మహిళ వలలో చిక్కడంతో వెలుగులోకి
2023లో చేప కోసం పరిశోధకులు నిర్వహించిన అన్వేషణలో చివరి రోజున ఇంబండో గ్రామానికి చెందిన స్థానిక మహిళ హెలెన్ అసు తన సంప్రదాయ చేతి వలతో రొయ్యలను పట్టుకుంటుండగా రెండు పైప్ఫిష్లు చిక్కాయి. వాటి ఫొటోలను పరిశోధకులకు పంపించగా, నిపుణులు అవి స్పినాక్ పైప్ఫిష్లేనని నిర్ధారించారు.
సముద్ర గుర్రాలతో సంబంధం
స్పినాక్ పైప్ఫిష్ సముద్ర గుర్రాలు, సీ డ్రాగన్లకు దగ్గరి సంబంధం ఉన్న జాతి. సన్నని శరీరం, పొడవైన ముట్టెతో కనిపించే ఈ చేప ఆకుపచ్చ-గోధుమ రంగులో ఉండటం వల్ల జలచర మొక్కల్లో సులభంగా కలిసిపోతుంది. సముద్ర గుర్రాల మాదిరిగానే మగ చేపలు పిల్లలను తమ ప్రత్యేక సంచిలో మోసే లక్షణం కూడా వీటికి ఉంది.
స్థానికుల పరిజ్ఞానం కీలకం
శాస్త్రీయ రికార్డుల్లో ఈ చేప కనిపించకపోయినా, స్థానిక ప్రజలకు మాత్రం ఈ జాతి గురించి చాలాకాలంగా తెలుసు. వారు దీనిని స్థానిక పేర్లతో పిలుస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ఘటన జీవవైవిధ్య పరిశోధనలో స్థానిక ప్రజల సంప్రదాయ జ్ఞానం ఎంత ముఖ్యమో మరోసారి చూపించింది.











