Bhadradhi kothagudem, 2026-06-05
చర్ల పోలీస్ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలెక్షన్స్ ప్రారంభమయ్యాయి. ఒలంపిక్స్ ఫ్లాగ్ ఊపి పరుగుపందెం పోటీలను చర్ల ఆలేం రాజు వర్మ, నర్సిరెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ మహీధర్ ప్రారంభించారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు.
చర్ల పోలీస్ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలెక్షన్స్ ప్రారంభమయ్యాయి. ఒలంపిక్స్ ఫ్లాగ్ ఊపి పరుగుపందెం పోటీలను చర్ల ఆలేం రాజు వర్మ, నర్సిరెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ మహీధర్ ప్రారంభించారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీలలో వరంగల్లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అర్హత సాధిస్తారు.
మైదానంపై ప్రశంసలు
ఈ సందర్భంగా మహీధర్ మాట్లాడుతూ, జిల్లా హెడ్ క్వార్టర్ లో తప్పితే ఇటువంటి క్రీడా మైదానం ఎక్కడా లేదని, ఇక్కడ నిర్మించిన 400 మీటర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంతో అనువుగా ఉందని అన్నారు. ఇటువంటి మైదానం అందించిన పోలీస్ శాఖ రాజు వర్మ, లు నర్సిరెడ్డి, కేశవ్ లకు, ప్రజలకు అభినందనలు తెలిపారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఈశ్వర్ శ్రీను, వెంకటనారాయణ, జిల్లా అథ్లెటిక్స్ కోచ్ లు నాగరాజు, ప్రసాద్, రవీందర్, కోచ్ లు పాల్గొన్నారు.




