మానుగూరు, 2024-09-02
పద, ధయతరగతి ుటుబాలు వైదయ ఖరచుల భార తగగిచదుు ుఖయతరి హాయనిధి అడగా నిలుతోదని పినపా ఎెలయ పాయ వెటశవరలు అననారు. ఆలలపలలి డల ుతతాపుర గరాానిి చెదిన ఈ జయుధు జూరైన రూ.46 వల ీఎ హాయనిధి చెును బుధవార ఎెలయ యాపు ారయాలయలో అదజశారు.
పేదల వైద్యానికి సీఎం సహాయనిధి అండా
మణుగూరు, సెప్టెంబర్ 2ప్రభంజనం: పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆల్లపల్లి మండలం ముత్తాపురం గ్రామానికి చెందిన ఈసం జయసుధకు మంజూరైన రూ.46 వేల సీఎం సహాయనిధి చెక్కును బుధవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం వైద్య సహాయం అందిస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం చేయించుకోలేని కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సహాయ కార్యక్రమాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.









