Bhadradhi kothagudem, 21 July
తనకు జన్మనిచ్చిన తండ్రి గోళ్ళమూడి లక్ష్మీ కాంతారావు ఆశయాలతో, ప్రకృతి అందాలు వెదజల్లే చెట్లు, వృక్షాల నుంచి లభించే వనమూలికల ద్వారా ఆయుర్వేద వైద్య చికిత్సలు అందిస్తూ, ప్రజలకు ఆరోగ్యపరంగా ఉపయోగపడేలా ఆయుర్వేద మందులు అందరికీ తెలిసేలా, అందరూ నమ్మేలా చేయాలనే నినాదంతో గోళ్లమూడి వెంకట మధుసూదన శర్మ (జివిఎంసి శర్మ) సేవలందిస్తున్నారు. ఆయనకు డాక్టర్ ఏల్చూరి వెంకటరావు, డాక్టర్ విశ్వనాథం ఆశీస్సులు అందించారు. మధుర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు వీరాభిమాని అయిన శర్మ, తన పూర్వీకుల స్ఫూర్తితో ఏజెన్సీ ప్రాంతంలో పేదలకు ఆయుర్వేద సేవలు అందించారు.

వెంకట మధుసూదన శర్మ కుటుంబం మొత్తం ఆయుర్వేద సేవలతో పాటు దేశభక్తిలో కూడా పేరు, ప్రఖ్యాతులు గడించింది. తన ఆది గురువులుగా భావించే అందరికీ ఆయుర్వేదం మాస పత్రిక వ్యవస్థాపకులు పండిత మహర్షి డాక్టర్ ఏల్చూరి వెంకట్రావు, తండ్రి గోళ్ళమూడి లక్ష్మీ కాంతారావు శుభాశీస్సులతో గత ఉమ్మడి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో వేలాదిగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహించి, వేలాది మందికి వైద్య చికిత్సలు అందించారు. ఆయుర్వేద వైద్య విధానాలపై రెండు రాష్ట్రాలలో వేలాది శిక్షణా శిబిరాలు నిర్వహించిన ఘనత జీవీఎంసీ శర్మకే దక్కింది. చెట్ల వనమూలికల వైద్య చికిత్సల గురించి క్రీస్తుపూర్వం కనుగొన్న మహా ఋషుల విగ్రహాలను సైతం రెండు రాష్ట్రాలలో ప్రతిష్ఠాపించడానికి కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి శర్మ.
డాక్టర్ పండిత మహర్షి ఏల్చూరి వెంకట్రావుతో కలిసి వేలాదిగా వైద్య శిబిరాలు, సదస్సులు నిర్వహించారు. 2016 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్, మైసూర్ యూనివర్సిటీలో ఉత్తమ అవార్డులు అందుకున్నారు. 'అందరికీ ఆయుర్వేదం' మాసపత్రికలో పలు జబ్బులకు విరుగుడుగా చెట్ల వనమూలికలతో నయమయ్యే చిట్కాలను ప్రచురించి, ప్రజలకు విస్తృతంగా ప్రచారం కోసం నిర్విరామంగా కృషి చేశారు. శర్మ తండ్రి లక్ష్మీకాంతారావు గత రజాకారుల నిజాం పాలనలో పాల్వంచ జాగీర్దార్ సంస్థానంలో తహసీల్దార్‌గా పనిచేశారు. కరకగూడెం మండలం ఏజెన్సీ ప్రాంతంలో పాఠశాలను ఏర్పాటు చేసి, విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు గాంధీజీ సిద్ధాంతాలను అనుసరిస్తూ నూలు వస్త్రాల వడకడం వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు.
వృద్ధాప్యంలోకి వస్తున్నప్పటికీ, తన జీవితాన్ని ఆయుర్వేద వైద్య విస్తరణకే అంకితం చేస్తున్నానని శర్మ చెబుతున్నారు. పండిత ఏల్చూరి వెంకట్రావు సహచరులు, భూస్తమ విద్యలో ప్రావీణ్యులు అయిన డాక్టర్ విశ్వనాథం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా కుముద్ బెన్ జోషి ఉన్న సమయంలో భూస్తమ విద్యను అభ్యసించారు. శర్మకు నీలకంఠేశ్వరుడు ఇష్టమైన దేవుడు. భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం కు చెందిన స్వయంభూ నీలకంఠేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, ఖమ్మం జిల్లా కుంచపర్తి శివాలయ నిర్మాణం సమయంలో సేవలు చేసి ఆనందం వ్యక్తం చేశారు. మధుసూదన శర్మ అల్లుడు, మాతృభూమి ఫౌండేషన్ అధినేత కాటారు కిరణ్ ఆదేశాల మేరకు ఖమ్మంలోని ఎస్.ఆర్.ఎన్.బి. కళాశాల ఆవరణలో భారతమాత చిత్రపటాన్ని ఆవిష్కరించారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న కిరణ్‌ను అభినందించారు.