మానుగూరు, 5 September
గ్రామస్తులకు భద్రాద్రి సేవా సమితి, వైద్య ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మండలం రామానుజవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 101 మంది గ్రామస్తులు వైద్య సేవలు పొందారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి సేవా సమితి, వైద్య ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మండలం రామానుజవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 101 మంది గ్రామస్తులు వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా ఏరియా హాస్పిటల్ డాక్టర్ టి. సౌజన్య మాట్లాడుతూ.. బాధితులకు బిపి, షుగర్ మరియు సీజనల్ వ్యాధుల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి వడబోసిన నీటినే తాగాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ యు. భవాని, సేవా సమితి కోఆర్డినేటర్ కె.వి. మారేశ్వర రావు, ఆసుపత్రి సిబ్బంది జి. నాగసాయి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








