Bhadradhi kothagudem, జూలై 15
దశలవారీగాచేపడతామనికుదీంతోనియోజకవర్గసేవలఅభివృద్ధిపైప్రజల్లోఆశాభావంవ్యక్తమవుతోంది. రాజనర్సింహకు ఖాళీగా విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన చేయాలనివినతిపత్రంలోప్రతిపాదించారు.నియోజకవర్గనాణ్యమైనఅందేలాందృష్టిసారించి ు, ల వాల్స్ నిర్మాణం, ులు, టెక్నీషియన్లు తదితర పోస్టులను తక్షణమే భర్తీ అలాగే ఆధునిక ు,వినతిపత్రాన్ని ,విస్తరించిఉండటంతో ఆసుపత్రితో , కేంద్రాలఆధారపడుతున్నారనిపాటుఆసుపత్రుల్లోవసతులలేమికారణంగా కు ను వినతి
హైదరాబాద్/మణుగూరు: పినపాక నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను అన్ని విధాలుగా బలోపేతం చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను బుధవారం హైదరాబాద్‌లో కలిసి కోరారు. ఈ మేరకు ఆయన్ను కలిసి సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం గిరిజన, అటవీ, గ్రామీణ, పారిశ్రామిక ప్రాంతాలతో విస్తరించి ఉండటంతో వేలాది మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. అయితే వైద్యులు, స్పెషలిస్టులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరతతో పాటు పలు ఆసుపత్రుల్లో మౌలిక వసతుల లేమి కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మణుగూరు 100 పడకల ఏరియా ఆసుపత్రితో పాటు బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మణుగూరు, గుండాల, కరకగూడెం, మొరంపల్లి బంజర, ఆళ్లపల్లి, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను మంత్రి దామోదర రాజనర్సింహకు అందజేశారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, స్పెషలిస్టులు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. అలాగే ఐసీయూ, చిన్నారుల వార్డు, ఓపీ షెడ్, బయోమెడికల్ గదులు, అదనపు పడకలు, ఆధునిక వైద్య పరికరాలు, అంబులెన్స్, మార్చురీ వాహనం, సబ్ సెంటర్ల భవనాలు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం, పెండింగ్‌లో ఉన్న హెచ్‌డీఎస్ నిధుల విడుదల, అవసరమైన చోట పీహెచ్‌సీలను సీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చేయాలని వినతిపత్రంలో ప్రతిపాదించారు. నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన పరిపాలనా, ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, దశలవారీగా అవసరమైన చర్యలు చేపడతామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. దీంతో పినపాక నియోజకవర్గ ప్రభుత్వ వైద్య సేవల అభివృద్ధిపై ప్రజల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది.











