దేశంలోకి మందులు, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాల దిగుమతులను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ఇందుకోసం అదనంగా 10 దిగుమతి కేంద్రాలను అనుమతుల జాబితాలో చేర్చాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దిగుమతిదారులు తమ గోదాములు, తయారీ కేంద్రాలకు సమీపంలోనే దిగుమతి సరుకులను క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
దేశంలోకి మందులు, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాల దిగుమతులను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ఇందుకోసం అదనంగా 10 దిగుమతి కేంద్రాలను అనుమతుల జాబితాలో చేర్చాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 1945 నాటి ఔషధ నియమాల్లోని రూల్ 43ఏకు సవరణలు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దిగుమతిదారులు తమ గోదాములు, తయారీ కేంద్రాలు, పంపిణీ కేంద్రాలకు సమీపంలోనే దిగుమతి సరుకులను క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రవాణా దూరం తగ్గడంతో పాటు ఖర్చులు ఆదా అవుతాయి. దిగుమతి చేసుకున్న మందులు, వైద్య పరికరాలు మార్కెట్‌కు చేరడంలో జాప్యం కూడా తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.
కేంద్రం ప్రతిపాదించిన జాబితాలో ఐదు రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ఎనిమిది ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలు (ఐసీడీలు), ఒక ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్), ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. నోయిడా విమానాశ్రయం ద్వారా విమాన మార్గంలో ఔషధాల దిగుమతికి అనుమతి కల్పించాలని ప్రతిపాదించారు. రాష్ట్రం ప్రతిపాదించిన కేంద్రాలు హర్యానా సోనిపట్, పియాలా, హర్సారు ఉత్తరప్రదేశ్ దాద్రి గుజరాత్ గాంధీధామ్ / ముంద్రా తెలంగాణ సనత్‌నగర్, తిమ్మాపూర్ కర్ణాటక వైట్‌ఫీల్డ్, బొమ్మసంద్ర ప్రత్యేక ఆర్థిక మండలి ఉత్తరప్రదేశ్ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం
ఈ ప్రతిపాదనలో తెలంగాణకు చెందిన సనత్‌నగర్, తిమ్మాపూర్ ప్రాంతాలకు చోటు కల్పించడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ దేశంలోని ప్రధాన ఔషధ తయారీ, వైద్య సాంకేతిక పరిశ్రమల కేంద్రాల్లో ఒకటిగా ఉంది. ఈ రెండు ప్రాంతాలు దిగుమతి కేంద్రాలుగా గుర్తింపు పొందితే హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని ఔషధ తయారీ సంస్థలు, వైద్య పరికరాల దిగుమతిదారులకు ప్రయోజనం కలగనుంది. దిగుమతి సరుకులను సమీపంలోనే క్లియర్ చేసుకునే అవకాశం. ఇతర ప్రాంతాల నుంచి సరుకులను తరలించే దూరం తగ్గింపు. రవాణా, నిల్వ ఖర్చుల్లో ఆదా. మందులు, వైద్య పరికరాల సరఫరాలో జాప్యం తగ్గింపు. ఆసుపత్రులు, పంపిణీ సంస్థలకు అవసరమైన ఉత్పత్తులు త్వరగా అందే అవకాశం.
దేశంలో ప్రస్తుతం అనుమతి పొందిన దిగుమతి కేంద్రాల జాబితాలో విమానాశ్రయాలతో పాటు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన ధన్నాడ్, తిహి ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలు ఉన్నాయి. వీటికి అదనంగా కొత్త కేంద్రాలను చేర్చడం ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు దిగుమతి సరుకుల పంపిణీ మరింత సులభతరం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 1945 నాటి ఔషధ నియమాల్లోని రూల్ 43ఏ ప్రకారం దేశంలోకి ఔషధాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతించిన ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, రోడ్డు మార్గాలు, ఇతర ప్రవేశ కేంద్రాలను నిర్దేశిస్తారు. ఈ జాబితాలో కొత్త ప్రాంతాలను చేర్చడం ద్వారా దిగుమతుల ప్రక్రియను క్రమబద్ధీకరించడంతో పాటు వ్యాపార సంస్థలకు మరిన్ని అవకాశాలు కల్పించవచ్చని కేంద్రం భావిస్తోంది.








