చార్మినార్, 7 October
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 111 మెడికల్ షాపుల్లో అవకతవకలు గుర్తించారు. అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లోని చార్మినార్, మెహదీపట్నం, టోలిచౌకి, మలక్‌పేట, గోషామహల్ ప్రాంతాల్లో టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది.
ట్రామడాల్, టాపెంటడాల్, నైట్రాజెపామ్, ప్రెగాబాలిన్, జోల్పిడెమ్, అల్ప్రాజోలం, కోడైన్ ఆధారిత దగ్గు సిరప్‌ల అక్రమ విక్రయాలు, మళ్లింపుపై ఈ తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మొత్తం 111 మెడికల్ షాపుల్లో అవకతవకలు గుర్తించారు. సంబంధిత దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, డ్రగ్ లైసెన్సుల సస్పెన్షన్ లేదా రద్దు వరకు చర్యలు ఉండొచ్చని టీజీ సేఫ్ తెలిపింది.












