మానుగూరు, 29 July
అ
మణుగూరు పట్టణంలోని ఆదర్శ్‌నగర్‌లో ముత్యాలమ్మ తల్లి గుడి సమీపంలో నివసిస్తున్న ప్రజలు మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాగు వెంట వరద ముప్పు నివారణ కోసం చేపట్టిన సైడ్‌వాల్ నిర్మాణ పనులను ఈ ప్రాంతానికి వచ్చేసరికి మధ్యలోనే నిలిపివేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టకపోవడంతో భారీ వర్షాలు కురిస్తే వరద నీరు నేరుగా కాలనీలోకి ప్రవహించే ప్రమాదం ఉందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత కంటే కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు సమస్యను మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం బాధాకరమని స్థానికులు వాపోతున్నారు. వెంటనే అసంపూర్తిగా ఉన్న సైడ్‌వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి వరద ముప్పు నుంచి ఆదర్శ్‌నగర్ ప్రజలను రక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత మున్సిపాలిటీ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లదేనని స్థానికులు హెచ్చరిస్తున్నారు.








