అడోబ్, గూగుల్ సంస్థలు తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ () భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాయి. క్రియేటివ్ టూల్స్, ఉత్పాదకత సేవలు, ఏఐ సాంకేతికతలను అనుసంధానించేందుకు వ్యూహాత్మక ఒప్పందాన్ని ప్రకటించాయి. అమెరికాలోని మియామీ బీచ్‌లో జరిగిన అడోబ్ మ్యాక్స్ సదస్సులో ఈ ప్రకటన వెలువడింది.
ఈ భాగస్వామ్యం ద్వారా అడోబ్ టూల్స్‌ను మరిన్ని గూగుల్ సేవల్లో అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, గూగుల్ అభివృద్ధి చేసిన అత్యాధునిక ఏఐ మోడళ్లను అడోబ్ అప్లికేషన్లలోకి తీసుకురానున్నారు. దీనివల్ల కంటెంట్ సృష్టికర్తలు, డిజైనర్లు, వ్యాపార సంస్థలు తమ పనులను వేగంగా, మరింత నాణ్యతతో పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.
గూగుల్ వర్క్‌స్పేస్‌లో అడోబ్ అక్రోబాట్
ఈ ఒప్పందంలో భాగంగా అడోబ్ అక్రోబాట్ను గూగుల్ వర్క్‌స్పేస్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. గూగుల్ డ్రైవ్, జీమెయిల్ ద్వారా నేరుగా అక్రోబాట్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఫైళ్ల ప్రివ్యూలో ఎడిట్ విత్ వంటి ఆప్షన్ల ద్వారా పీడీఎఫ్ డాక్యుమెంట్లను అక్రోబాట్లో తెరిచి సవరించుకునే అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం ప్రతి ఏడాది 400 బిలియన్లకు పైగా పీడీఎఫ్ ఫైళ్లు అడోబ్ అక్రోబాట్ ద్వారా తెరవబడుతున్నాయని సంస్థ వెల్లడించింది.
జెమినీ ఏఐతో పీడీఎఫ్‌ల ఎడిటింగ్
గూగుల్‌కు చెందిన జెమినీ ఏఐ మోడళ్లను అడోబ్ అక్రోబాట్లోని ఏఐ ఫీచర్లకు అనుసంధానించనున్నారు. దీనివల్ల వినియోగదారులు సాధారణ సంభాషణ రూపంలో సూచనలు ఇస్తూ పీడీఎఫ్ డాక్యుమెంట్లను సవరించుకోవచ్చు. డాక్యుమెంట్లలోని సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవడంతోపాటు, ప్రజెంటేషన్లు, రెజ్యూమెలు, నివేదికలు వంటి వాటిని వేగంగా రూపొందించుకోవచ్చు.
జెమినీ, గూగుల్ సెర్చ్‌లో అడోబ్ టూల్స్
గూగుల్ జెమినీ, జెమినీ ఎంటర్ప్రైజ్లో అడోబ్ సేవల అనుసంధానాన్ని మరింత విస్తరించనున్నారు. అక్రోబాట్తోపాటు ఇతర క్రియేటివ్ టూల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. జెమినీతో సంభాషిస్తున్న సమయంలోనే చిత్రాలను మెరుగుపరచడం, డిజైన్లను మార్చడం, పీడీఎఫ్ ఫైళ్లను సవరించడం వంటి పనులు చేసుకోవచ్చు. గూగుల్ సెర్చ్‌లోని ఏఐ మోడ్‌లోనూ అడోబ్ క్రియేటివ్ టూల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో వినియోగదారులు తమకు కావాల్సిన ఆలోచనలు, సమాచారాన్ని వెతకడం నుంచి వాటికి అనుగుణంగా కంటెంట్ రూపొందించడం వరకు ఒకే చోట చేసుకునే అవకాశం ఉంటుంది.
అడోబ్‌కు చెందిన ఫైర్‌ఫ్లై (), ఫొటోషాప్ (), ప్రీమియర్ (), ఎక్స్‌ప్రెస్ () వంటి అప్లికేషన్లలో గూగుల్ అభివృద్ధి చేసిన అత్యాధునిక చిత్ర, వీడియో ఏఐ మోడళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. జెమినీ ఓమ్ని, వీయో (), నానో బనానా ( ) వంటి మోడళ్లను ఉపయోగించుకునే అవకాశం కల్పించనున్నారు. దీంతో డిజైనర్లు, వీడియో ఎడిటర్లు తమ సృజనాత్మక పనుల కోసం వివిధ ఏఐ మోడళ్లలో తమకు అనువైన వాటిని ఎంచుకోవచ్చు. అదే సమయంలో అడోబ్ ప్రొఫెషనల్ టూల్స్‌లో ఉండే కచ్చితత్వం, ఎడిటింగ్ నియంత్రణను కొనసాగించవచ్చు.
గూగుల్ డీప్‌మైండ్, అడోబ్ సంస్థలు కలిసి ఫొటోషాప్‌లో కొత్త ఏఐ ఆధారిత ఎడిటింగ్ సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు పనిచేయనున్నాయి. గూగుల్ ఇమేజ్ మోడల్‌ను ఫొటోషాప్ అవసరాలకు అనుగుణంగా రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. దీని ద్వారా వినియోగదారులు టెక్స్ట్ రూపంలో సూచనలు ఇవ్వగానే చిత్రాల్లో మార్పులు చేసే విధంగా, దాదాపు తక్షణమే ఎడిటింగ్ జరిగే అవకాశముంది. ఒకే చిత్రానికి భిన్నమైన రూపాలను రూపొందించి, తమకు నచ్చిన దాన్ని ఎంచుకునే సదుపాయం కల్పించాలనేది లక్ష్యం. అయితే ఈ ఫీచర్ల అభివృద్ధి ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది.

