పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో 'మీడియా టుడే జాతీయ దిన పత్రిక' 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాని నిరంతరం సమాజ హితం కోసం పాటుపడాలని సూచించారు.
సమాజ గమనాన్ని నిర్దేశించడంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అభివర్ణించారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలోనూ, పారదర్శకమైన సమాచారాన్ని అందించడంలోనూ మీడియా ప్రతినిధుల నిరంతర శ్రమను ఆయన ప్రశంసించారు.
సమాజ అభివృద్ధిలో పత్రికా రంగం ఒక బలమైన శక్తి అని, నిష్పక్షపాత వార్తలతో ప్రజలను చైతన్యపరచాలని ఎమ్మెల్యే సూచించారు. 'మీడియా టుడే' సంస్థ యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా ఒక బలమైన వారధిలా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.








