శివాజీనగర్‌లోని, 27 జనవరి 2027
మహారాష్ట్రలోని పుణెలో పట్టణ రవాణా వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మెట్రో పింక్ లైన్‌ను ప్రారంభించారు. సుమారు రూ.21,800 కోట్ల విలువైన మెట్రో అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
రూ.8,300 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పుణె మెట్రో లైన్3 (పింక్ లైన్) సుమారు 23 కిలోమీటర్ల పొడవుతో మాన్ ప్రాంతాన్ని శివాజీనగర్‌లోని జిల్లా కోర్టు మెట్రో స్టేషన్‌తో అనుసంధానిస్తుంది. ముఖ్యంగా హింజేవాడి ఐటీ హబ్‌కు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, రోజువారీ ప్రయాణికులకు ఈ మార్గం ఎంతో ఉపయోగపడనుంది.
ఈ మార్గంలో తొలి దశలో 17 స్టేషన్ల వద్ద ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన ఆరు స్టేషన్లను దశలవారీగా 20 నాటికి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల కోసం మెట్రో సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి.
రెండో దశలో నాలుగు కొత్త కారిడార్లు
పుణె మెట్రో రెండో దశలో సుమారు రూ.13,500 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు కొత్త కారిడార్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అవి: వనాజ్చాందనీ చౌక్, రామ్వాడివిఠల్వాడి, ఖరాడీఖడక్వాస్లా, నల్ స్టాప్మాణిక్ బాగ్. ఈ మార్గాలు నగరంలోని నివాస ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు, ఐటీ ప్రాంతాల మధ్య రవాణా అనుసంధానాన్ని మరింత విస్తరించనున్నాయి. ఇప్పటికే ఉన్న మెట్రో నెట్‌వర్క్‌తో పాటు అంతర్నగర బస్సు సేవలకు కూడా అనుసంధానం కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.
మహిళా ఆపరేటర్లతో పింక్ లైన్
పింక్ లైన్లో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ మెట్రో సేవలను పూర్తిగా మహిళా రైలు ఆపరేటర్లు నిర్వహించనున్నారు. విద్యుత్ అవసరాల్లో సుమారు 30 శాతాన్ని సౌర విద్యుత్ ద్వారా సమకూర్చాలని ప్రణాళిక రూపొందించారు.
ఈ కొత్త కారిడార్‌తో హింజేవాడి ఐటీ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. వ్యక్తిగత వాహనాలపై ఆధారపడటం తగ్గితే, వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని కూడా నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది.
నగరాభివృద్ధికి మెట్రో కీలకం: మోదీ
మెట్రో నెట్వర్క్ విస్తరణ పుణె నగర అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆధునిక ప్రజా రవాణా సదుపాయాలు ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, నగర ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు, వాణిజ్యాభివృద్ధికి కూడా తోడ్పడతాయని వివరించారు.
దేశవ్యాప్తంగా మెట్రో సేవలు అందుబాటులో ఉన్న నగరాల సంఖ్య 26కు చేరిందని, దేశ మెట్రో నెట్వర్క్ గతంలో సుమారు 248 కిలోమీటర్ల నుంచి 1,200 కిలోమీటర్లకు పైగా విస్తరించిందని ఆయన తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ పుణెలో రూ.8,300 కోట్లతో నిర్మించిన 23 కిలోమీటర్ల మెట్రో పింక్ లైన్‌ను ప్రారంభించారు. రూ.13,500 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు కొత్త కారిడార్లకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు పుణె నగరంలో పట్టణ రవాణాను మెరుగుపరుస్తాయి.












