సీర్ బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రచురణ సంస్థ ఇమ్మోర్టల్ టాక్స్ ( ) పుస్తక సిరీస్లో మూడో భాగాన్ని విడుదల చేసింది. 2017లో ప్రారంభమైన ఈ సిరీస్కు రచయిత శూన్య అనే కలం పేరుతో రచనలు చేస్తున్నారు. ఈ సిరీస్లో ఆధ్యాత్మిక జ్ఞానం, అమరత్వం, జీవితం, విశ్వ రహస్యాల వంటి అంశాలను కథా రూపంలో వివరించారు.
ఈ పుస్తక సిరీస్లో చిరంజీవి హనుమంతుడు, ఆయన శిష్యులైన మహతాంగ్ తెగకు చెందిన వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలు ప్రధాన ఇతివృత్తంగా ఉంటాయి. ప్రతి 41 సంవత్సరాలకు ఒకసారి మహతాంగ్ తెగకు చెందిన తరువాతి తరాల వారిని కలుసుకుని జ్ఞానాన్ని అందిస్తానని హనుమంతుడు వాగ్దానం చేసినట్లు కథలో వివరించారు. కర్మ, కోరికలు, ఆత్మ, విధి, మరణం, కాలం, స్థలం, వాస్తవికత వంటి తాత్విక అంశాలను ఈ పుస్తకాలు చర్చిస్తాయి.
మూడో పుస్తకంలో పది అధ్యాయాలు
ఇమ్మోర్టల్ టాక్స్ బుక్ 3లో మొత్తం పది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో పరిశీలకుడి స్వభావం, మనిషి గ్రహించే విధానం, కాల ప్రయాణం ( ), కాలానికి మధ్య అనుసంధానాలు ( ), అనుభవాల ప్రభావం, వాస్తవికత స్వరూపం వంటి అంశాలను వివరించారు. మునుపటి రెండు పుస్తకాలలో ప్రారంభమైన ఆధ్యాత్మిక, తాత్విక ప్రయాణాన్ని మూడో భాగం మరింత ముందుకు తీసుకెళ్తుందని ప్రచురణ సంస్థ తెలిపింది.
కలిహనువాణి తదుపరి భాగం 2027లో
ఇమ్మోర్టల్ టాక్స్ సిరీస్లో మొదటి పుస్తకం 2017లో, రెండో పుస్తకం 2019లో విడుదలయ్యాయి. ఈ రెండు ఆంగ్ల పుస్తకాల ఆధారంగా హిందీ పాఠకుల కోసం కలిహనువాణి () పుస్తకాన్ని 2020లో విడుదల చేశారు. ప్రస్తుతం కలిహనువాణి తదుపరి భాగం రూపకల్పన పనులు కొనసాగుతున్నాయని, 2027లో విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు సీర్ బుక్స్ ప్రకటించింది.










