రాష్ట్రంలో మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గత ఏడాది న ప్రారంభమైన ఈ పథకం, ఇప్పటివరకు 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలను పూర్తి చేసుకుంది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.
స్త్రీశక్తి పథకం మహిళల ఆదరణతో, మాతృమూర్తుల ఆమోదంతో ఈ ఘనత సాధించింది. గత ఏడాది న ప్రారంభమైన ఈ పథకం, 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలను పూర్తి చేసుకోవడం ఎంతో గర్వకారణం. ప్రస్తుతం రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇది రాష్ట్ర మహిళల జీవితాల్లో పథకం ఒక భాగమైపోయిందని తెలియజేస్తోంది. చదువుకునే విద్యార్థినులకు, ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు, రోజువారీ ఉపాధి కోసం ప్రయాణించే వారికి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎంతో శక్తినిచ్చింది. ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి, తమ అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే భరోసాను అందిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా మహిళలు రూ.3550 కోట్ల మేర ఆదా చేసుకున్నారు. ఇలా ఆదా అయిన ప్రతి రూపాయి వారి పిల్లల చదువుకు, కుటుంబ అవసరాలకు, భవిష్యత్తుకు ఉపయోగపడాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష. ఈ పథకాన్ని ఆదరిస్తున్న మహిళలందరికీ కృతజ్ఞతలు. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధ్యం చేయడంలో కృషి చేసిన ఆర్టీసీ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు.











