ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలోని ఎల్.అగ్రహారం టిడ్కో గృహసముదాయంలో యాదాల మంగ (28) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం ఉన్న గెడ్డం సందీప్‌తో గొడవపడి, ఆ తర్వాత ఆమె పీక నులిమి హత్య చేసినట్లు సమాచారం.
శుక్రవారం తెల్లవారుజామున మంగ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని విజయకుమారి గుర్తించారు. వెంటనే మృతురాలి సోదరి రత్నమ్మకు సమాచారం అందించారు. మృతురాలి సోదరి రత్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ దారుణ హత్యపై విచారణ ప్రారంభించిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు నిందితుడు గెడ్డం సందీప్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.











