మణుగూరు మండల తహశీల్దార్ అద్దంకి నరేష్, తన నిబద్ధతతో కూడిన పనితీరుతో ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. సర్టిఫికెట్ల జారీలో వేగం, ప్రభుత్వ పథకాల అమలులో చురుకుదనం, భూ సేకరణ పనుల నిర్వహణలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.
తహశీల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్లకు సంబంధించి ఎలాంటి దరఖాస్తులు పెండింగ్లో లేకుండా చూడటమే తన ప్రధాన లక్ష్యమని అద్దంకి నరేష్ తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, లబ్ధిదారులకు సకాలంలో వాటిని అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
మణుగూరు ఓ సి విస్తరణ భూ సేకరణ పనులను వేగవంతం చేయడంతో పాటు, నిష్పక్షపాతంగా, త్వరితగతిన భూ సేకరణ పనులను పూర్తి చేసేందుకు ఆయన దృష్టి సారించారు.
ఎక్కడా అక్రమాలకు తావివ్వకుండా, పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తున్న అద్దంకి నరేష్ పనితీరు అందరి ప్రశంసలకు పాత్రమైంది. ఆయన నిబద్ధత కలిగిన అధికారిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఆయన చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో ముందంజలో ఉంటున్నారు.








