మానుగూరు, 2024-09-01
శొసచఛదసేససథఆధోూోఉచచే.ఈనసబధచనననససథనధఆచ.నచసదభజఉచనఅదజేనననససథఅధడదడనసహె.
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా శ్రీ మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని మణుగూరు సురక్ష బస్టాండ్‌లో సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు దండ నరసింహారావు మాట్లాడుతూ, ఈ నెల 14న వినాయక చవితి సందర్భంగా ప్రజలకు ఉచితంగా మట్టి గణపతులను అందజేస్తామని తెలిపారు. మణుగూరు పూల మార్కెట్లోని శ్రీదేవి మెడికల్ షాప్ వద్ద ఈ నెల 13వ తేదీ సాయంత్రం నుంచి 14వ తేదీ ఉదయం వరకు విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
పర్యావరణ పరిరక్షణ, భావితరాల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని, కాలుష్యాన్ని నివారించేందుకు సహకరించాలని ఆయన కోరారు. సంస్థ వ్యవస్థాపకుడు చెరుకుపల్లి ఉపేందర్‌రావు మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు సంస్థ ఆధ్వర్యంలో ఏటా ఉచిత మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఉప్పాడ అనిత, ఉపాధ్యక్షురాలు తమ్మిశెట్టి రమాదేవి, సహాయక కార్యదర్శి పూజారి జ్యోతి, గౌరవ సలహాదారులు వరలక్ష్మి, ఇండ్ల లక్ష్మణ్, ప్రచార కార్యదర్శి బత్తుల సుజాత, ఆగమ, జోష్ణ, బీసీ సంఘ రాష్ట్ర నాయకులు సాంబ, బింగిని రమాదేవితో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.









