మానుగూరు, 22 July
మణుగూరులో స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆటస్థలం ఇసుక లారీలతో అస్తవ్యస్తంగా మారింది. శివాజీనగర్, కొమ్ముగూడెం, గుండ్ల సింగారం ఇసుక ర్యాంపుల నుండి లోడింగ్ కోసం వచ్చిన లారీలను మైదానంలో నిలపడంతో ప్లే గ్రౌండ్ ధ్వంసమైంది. దీంతో క్రీడా ప్రియులు, వాకర్స్ క్లబ్ సభ్యులు లారీలను అడ్డుకున్నారు.
మణుగూరు మండల పరిధిలోని స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆటస్థలం (ప్లే గ్రౌండ్) ఇసుక లారీలతో అస్తవ్యస్తంగా మారింది. శివాజీనగర్, కొమ్ముగూడెం, గుండ్ల సింగారం ఇసుక ర్యాంపుల నుండి లోడింగ్ కోసం వచ్చిన ఇసుక లారీలను, స్థానిక ప్లే గ్రౌండ్లో యార్డ్‌గా నిలిపడంతో మైదానం మొత్తం ధ్వంసమైంది.
ఈ ఆటస్థలం కొన్ని సంవత్సరాలుగా క్రీడా ప్రియులకు, రోజువారీ వాకింగ్ చేసే వారికి, సెంట్రల్ ఫోర్స్ ట్రైనింగ్‌కు హాజరయ్యే నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడుతోంది. లారీలను మైదానంలో నిలపడంతో ప్లే గ్రౌండ్ పరిస్థితి దయనీయంగా మారింది.
ఈ నేపథ్యంలో, లారీలను నిలిపివేసిన క్రీడా ప్రియులు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాకర్స్ క్లబ్ సభ్యులు కలిసి సంయుక్తంగా ఇసుక లారీలను అడ్డుకున్నారు.











