కొత్తగూడెం, 12 September
భద్రాద్రి జిల్లా ఏరియాలో ఎస్ అండ్ పి సి విభాగంలో పనిచేసిన చంద్రశేఖర్ జేమేదార్ అకాల మరణం పట్ల ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
*చంద్రశేఖర్ మృతికి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ నివాళి* భద్రాద్రి జిల్లా ఏరియాలో ఎస్ అండ్ పి సి విభాగంలో విధులు నిర్వహించిన శ్రీ చంద్రశేఖర్ జేమేదార్ అకాల మరణం పట్ల ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, కమిటీ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ పార్ధివ దేహానికి అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీ అంతోటి నాగేశ్వరరావు, సెంట్రల్ కమిటీ మెంబర్ శ్రీ బందెల విజయేందర్, జూనియర్ ఇన్స్పెక్టర్ మణుగూరు వంగపల్లి సుమన్, కొప్పుల శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రశేఖర్ అకాల మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరూ చంద్రశేఖర్ మృతికి సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు.


