అశ్వాపురం, ఆగస్టు 2
అశవంండధండంఉఓంశఆంవదదెవవథం,ధంఅశవంేషఅం.వవేవేేఉదదేశంఈేఆె.
అశ్వాపురం మండల పరిధిలోని చింత్రియాల క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న ఓం శక్తి ఆలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తి పోగొట్టుకున్న వన్ప్లస్ మొబైల్ ఫోన్ స్థానిక జర్నలిస్ట్ బర్ల కిరణ్కు లభ్యమైంది. ఆయన ఆ మొబైల్ ఫోన్ను బాధ్యతాయుతంగా గుర్తించి, అశ్వాపురం పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
పోగొట్టుకున్న వస్తువులను యజమానులకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు బర్ల కిరణ్ తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు తగిన ఆధారాలతో అశ్వాపురం పోలీస్ స్టేషన్ను సంప్రదించి తమ ఫోన్ను స్వీకరించవచ్చని పోలీసులు సూచించారు.
ప్రజలు విలువైన వస్తువులు పోగొట్టుకున్న సందర్భాల్లో వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, అలాగే ఎవరికైనా పోగొట్టుకున్న వస్తువులు లభిస్తే వాటిని పోలీసులకు అప్పగించి బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని పోలీసులు కోరారు.











