మానుగూరు, 2024-08-10
తల్లి, పిల్లలను వేరు చేస్తూ అన్యాయం చేస్తున్న ముత్యాలమ్మ నగర్ సర్పంచ్‌పై చర్యలుచేపట్టాలి తీసుకోవాలని తలారి కవిత కోరారు. ఇద్దరు పిల్లలున్న తమ కుమార్తె హేమలతను, భర్త లేని పరిస్థితిని ఆసరాగా చేసుకుని, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న చిటికెన రామకృష్ణ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి ఆకర్షించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
తల్లి, పిల్లలను వేరు చేస్తూ అన్యాయం చేస్తున్న ముత్యాలమ్మ నగర్ సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని తలారి కవిత కోరారు. ఇద్దరు పిల్లలున్న తమ కుమార్తె హేమలతను, భర్త లేని పరిస్థితిని ఆసరాగా చేసుకుని, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న చిటికెన రామకృష్ణ అనే వ్యక్తి జీవితాంతం నిన్ను పోషిస్తాను, పిల్లలను వదిలేసి వస్తే వివాహం చేసుకుంటాను అంటూ మాయమాటలు చెప్పి ఆకర్షించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
పోలీసులకు ఫిర్యాదు
ఈ విషయం హేమలత తల్లిదండ్రులకు తెలియడంతో, వారు ఆమెను మందలించి, సంబంధిత వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
సర్పంచ్ పక్షపాతం
బయట మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటామని రామకృష్ణ కుటుంబ సభ్యులు చెప్పిన అనంతరం, ముత్యాలమ్మ నగర్‌కు చెందిన సర్పంచ్ జంపేశ్వరి ఇరువర్గాలను పిలిపించి పంచాయతీ ద్వారా సమస్యను పరిష్కరిస్తానని చెప్పినప్పటికీ, ఆమె పక్షపాతంగా వ్యవహరించి హేమలతను తన ఇద్దరు చిన్నపిల్లలను వదిలి వెళ్లేలా ప్రోత్సహించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
న్యాయం చేయాలని డిమాండ్
తల్లిని, పిల్లలను విడదీసేలా పంచాయతీలో ఒత్తిడి చేయడం సరైనది కాదని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని తల్లి కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా మండలి విజ్ఞప్తి
ఈ ఘటనపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు డిమాండ్ చేశారు.
క్రమశిక్షణ చర్యలు
అలాగే, ప్రజాప్రతినిధిగా వ్యవహరించే వ్యక్తి పక్షపాతానికి పాల్పడినట్లు విచారణలో తేలితే, సంబంధిత పార్టీ, అధికార యంత్రాంగం తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.









