భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్కు సంబంధించిన 20 ఏళ్ల నాటి ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆయన కేరళ రాష్ట్ర ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ) కార్యదర్శిగా పనిచేసిన సమయంలో జరిగినట్లు ఆరోపణలున్న అవకతవకలపై కేరళ ప్రభుత్వం తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మలేషియాకు చెందిన ఓ ఇంజినీర్ ఆత్మహత్య వ్యవహారంతో పాటు, ప్రభుత్వ నిర్మాణ పనుల కాంట్రాక్టుల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు జరగనుంది.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత మలయింకీజ్ వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేరళ హోంమంత్రి రమేశ్ చెన్నితల విజిలెన్స్ శాఖకు విచారణ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి వీడీ సతీశన్తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
1. అసలు ఈ కేసు ఏమిటి
ఈ వివాదం 2006లో జ్ఞానేశ్ కుమార్ కేరళలో ప్రజాపనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన కాలానికి సంబంధించినది. ఆ సమయంలో కేరళలో ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో సుమారు రూ.215 కోట్ల విలువైన రహదారి అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టారు. అంగమాలి నుంచి తిరువనంతపురం వరకు ఉన్న ఎంసీ రహదారి అభివృద్ధి ఈ ప్రాజెక్టులో భాగం. ఈ పనులను పీఏటీఐ-బీఈఎల్ అనే ఇండో-మలేషియా సంస్థల కన్సార్టియం చేపట్టింది. ఈ ప్రాజెక్టులో మలేషియాకు చెందిన సివిల్ ఇంజినీర్ లీ సీ బీన్ కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే పనుల అమలు సమయంలో కాంట్రాక్టు చెల్లింపులు, బిల్లుల మంజూరు, అధికారుల వ్యవహారశైలిపై వివాదాలు తలెత్తినట్లు ఆరోపణలున్నాయి.
2. మలేషియా ఇంజినీర్ ఆత్మహత్యతో కేసుకు సంబంధం ఏమిటి
ఈ వ్యవహారంలో ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్న వ్యక్తి మలేషియా ఇంజినీర్ లీ సీ బీన్. ఆయన కేరళ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులో పనిచేస్తున్న సమయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.