మానుగూరు, 2026-10-11
మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్ సమీపంలో గల మసీదు వద్ద రూ.6 లక్షల వ్యయంతో నిర్మించిన రంజాన్ షెడ్డును పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శానభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సౌకర్యార్థం నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు ఉపయోగకరంగా ఉండేలా రంజాన్ షెడ్డు నిర్మాణం చేపట్టడం సంతోషకరమని తెలిపారు.
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్ సమీపంలో గల మసీదు వద్ద రూ.6 లక్షల వ్యయంతో నిర్మించిన రంజాన్ షెడ్డును పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సౌకర్యార్థం నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు ఉపయోగకరంగా ఉండేలా రంజాన్ షెడ్డు నిర్మాణం చేపట్టడం సంతోషకరమని తెలిపారు.
అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, మణుగూరు మున్సిపాలిటీతో పాటు పినపాక నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మైనారిటీ అధ్యక్షులు రహీం పాషా, మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు కురం రవి ముదిరాజ్, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మైనారిటీ సోదరులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








