ఇటిక్యాల, 2026-08-27
క్యా తనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సూపర్ బజార్ ఏరియాలో గల సాయిబాబా ఆలయం సమీపంలో ఖాళీ బీర్ సీసాలు దర్శనమివ్వడం భక్తుల్లో ఆందోళన రేకెత్తించింది. పవిత్ర శ్రావణమాసంలో ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా మారడంపై వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
క్యా తనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సూపర్ బజార్ ఏరియాలో గల సాయిబాబా ఆలయం సమీపంలో ఖాళీ బీర్ సీసాలు దర్శనమిస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, బుధవారం రాత్రి ఈ ప్రాంతంలో నిర్వహించిన ఒక వివాహ వేడుకల్లో కొందరు యువకులు మద్యం సేవించి, ఖాళీ సీసాలను ఆలయ పరిసరాల్లో పడవేసినట్లు సమాచారం.
భక్తుల ఆందోళన
పవిత్ర శ్రావణమాసం కావడంతో గురువారం ఆలయానికి వచ్చిన భక్తులకు ఈ సీసాలు కనిపించాయి. దీంతో అవాక్కైన కొందరు భక్తులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించకుండా, సీసాలు పడవేయకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.










