రామకృష్ణాపూర్ (రాజకీయ ప్రభంజనం) ఆగస్టు 27
మధోఫే-2ోఅధష,అధషొశశ.అైఎూమోోఅధ,ఎధఆూ.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో 1, 2, 3 పోలింగ్ బూత్‌లలో జరుగుతున్న ఫేజ్-2 నోటీసుల ప్రక్రియను జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్‌ల పరిధిలోని ఓటర్లు, బిఎల్ఏలు, స్థానికులతో మాట్లాడి ఫేజ్-2 నోటీసులకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ, ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు ఈ ప్రక్రియ ఉద్దేశించినప్పటికీ, అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు, బిఎల్ఓలు, రాజకీయ పార్టీల బిఎల్ఏలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఫేజ్-2లో నోటీసులు అందుకున్న ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నోటీసులో పేర్కొన్న అంశాలను పూర్తిగా పరిశీలించి, అవసరమైన వివరాలు మరియు పత్రాలను నిర్ణీత విధానంలో సమర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలపై స్థానికులతో చర్చించి, ఓటర్లకు అవసరమైన సహకారం అందించేలా కాంగ్రెస్ పార్టీ తరఫున బిఎల్‌లకు సూచనలు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డుకౌన్సిలర్ భీమ మల్లేష్, మాజీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, బిఎల్వోలు, బిఎల్ఏలు, కార్యకర్తలు, ఓటర్లు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










