శ్రీకాళహస్తి, 14 September
శ్రీ నలంద శ్రీవిద్య వివేకవర్ధని విద్యాసంస్థల ప్రాంగణంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయ విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో విద్యాసంస్థల చైర్మన్ మేదరమెట్ల వెంకట చౌదరి, ధనలక్ష్మి దంపతులు పాల్గొన్నారు.
శ్రీ నలంద శ్రీవిద్య వివేకవర్ధని విద్యాసంస్థల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు •విజయ విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చైర్మన్ మేదరమెట్ల వెంకట చౌదరి, ధనలక్ష్మి దంపతులు, శ్రీ నలంద శ్రీవిద్య వివేకవర్ధని విద్యాసంస్థల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థల ప్రాంగణంలో ప్రతిష్ఠించిన విజయ విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ మేదరమెట్ల వెంకట చౌదరి, ధనలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, నిర్వహించారు. విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో విద్యాసంస్థలు మరింత అభివృద్ధి సాధించాలని, విద్యార్థులు విద్య, విజ్ఞానం, నైపుణ్యాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని వారు మనస్ఫూర్తిగా ప్రార్థించారు. విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర స్వామి కృపతో విద్యాసంస్థల్లో విద్యార్థులకు ప్రశాంతమైన, సానుకూలమైన విద్యా వాతావరణం నెలకొనాలని కోరుకున్నారు. వినాయక చవితి సందర్భంగా విద్యాసంస్థల ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో పండుగ వాతావరణం నెలకొంది. పూజా కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకురాళ్లు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల సీఈవో మేదరమెట్ల శ్రీ చైతన్య కృష్ణ మాట్లాడుతూ, విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో విద్యాసంస్థలు మరింత అభివృద్ధి చెందాలని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఈవో మేదరమెట్ల చైతన్య కృష్ణతో పాటు విద్యా గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు మరియు అధ్యాపకులు, అధ్యాపకురాళ్లు, సిబ్బంది, విద్యాసంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









