నగరంలోని రోబో మైండ్స్ స్కూల్ తన వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
శ్రీ భవానీ శంకర్ నగర్, వాసవి కళ్యాణం గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏసీపీ వై. శ్రీనివాస్ కుమార్, కినారా వెల్ఫేర్ సొసైటీ స్థాపకురాలు నాగచంద్రిక, డీసీసీబీ మెదక్ డైరెక్టర్ పట్లొల్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ముఖ్య అతిథులు విద్యార్థుల విద్యా నైపుణ్యాలను, సాంస్కృతిక ప్రదర్శనలను ప్రశంసించారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని నిర్వాహకులు తెలిపారు.
విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మకతను, ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించింది.
పాఠశాల కరస్పాండెంట్ అలేఖ్య రాయల ఆధ్వర్యంలో జరిగిన ఈ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయడానికి తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.









