మానుగూరు, 2026-08-03
మణుగూరు ఏరియాలోని ఓసీ-2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) దక్కించుకోవడం మణుగూరు ప్రాంత అభివృద్ధికి కీలక మలుపని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి పేర్కొన్నారు.

ఉపాధి అవకాశాలు పెరుగుతాయి
ఈ నిర్ణయంతో సింగరేణి సంస్థ మరింత బలోపేతం కావడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. గని కార్యకలాపాల విస్తరణతో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించి, వ్యాపారాలు, అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశముందని తెలిపారు.
కొత్త భరోసా
మణుగూరు ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ పరిణామం ప్రాంత భవిష్యత్తుకు కొత్త భరోసాను కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సంక్షేమం మెరుగుపడాలి
సింగరేణి అభివృద్ధితో కార్మికులు, స్థానిక ప్రజల సంక్షేమం మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు.