మణుగూరు ఏరియా సింగరేణి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగం హెచ్ఓడీగా బాధ్యతలు చేపట్టిన పసుల రమేష్‌ను సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్మికులు ఆయనకు శాలువా కప్పి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.
సింగరేణిలో కిందిస్థాయి ఉద్యోగిగా చేరి, స్వయంకృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన పసుల రమేష్‌ను ఆదర్శంగా తీసుకోవాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్డీ నాసర్ పాషా అన్నారు. రమేష్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కార్మికులు ఆకాంక్షించారు.
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ, 2025 మార్చి చివరి తేదీలోగా సీఎంపీఎఫ్ లెక్కల పాస్‌బుక్కులు అందించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరారు.
ఈ సన్మాన కార్యక్రమంలో ఐఎఫ్టీయూ ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్‌తో పాటు పలువురు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది.









