మానుగూరు, 2026-11-22
మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని సమితి సింగారం, గుండు సింగారం, సుతారి గుంపు, విద్యానగర్ కాలనీలలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం గురించి ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, వార్డు సభ్యులు బిరుదురాజుల శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు పిరునాకి నవీన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ లు మాట్లాడుతూ, సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడానికి తీసుకువచ్చిన గొప్ప సంక్షేమ పథకం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం గురించి ఇంటింటికి తిరిగి వివరించామని తెలిపారు. సమితి సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నాలుగు కౌంటర్ల ద్వారా నమోదు ప్రక్రియను వేగవంతం చేశామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు పిరునాకి నవీన్ మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. దానిలో భాగంగా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని గొప్ప సంక్షేమ పథకం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అని అన్నారు. సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పుట్టినిల్లు అని చెప్పడంలో అతిశయోక్తి లేదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మ కమిటీ డైరెక్టర్ కొమురం రామ్మూర్తి, ఎస్ గణేష్ రెడ్డి, భాగం రవి, కొడెం సాంబశివరావు, బుర్ర సదానందం, రాజు తదితరులు పాల్గొన్నారు.






