భద్రాచలం, 2026-11-22
క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు ఆదివారం జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జగన్మోహిని అలంకారంలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు.
క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు ఆదివారం జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జగన్మోహిని అలంకారంలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. స్వామివారికి భక్తిశ్రద్ధలతో క్షీరాన్ని నివేదించారు. అనంతరం నివేదించిన క్షీరాన్ని భక్తులకు ప్రసాదంగా వితరణ చేశారు. స్వామివారి దివ్య అలంకారం, ప్రత్యేక పూజలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భద్రాద్రి క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.






