కోహెడ (రాజకీయ ప్రభంజనం) నవంబర్ 21
బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న నిరుపేద పూజారి మిశ్రా సర్జరీ కోసం ఎల్ వో సి మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి విజ్ఞప్తి చేశారు.
సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గం, కోహెడ మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయం, తీగలకుంటపల్లి పార్వతి పరమేశ్వర గుడిలో నిత్య పూజరిగా పనిచేస్తున్న మిశ్రా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు. సర్జరీకి రూ. 10,00,000 (పది లక్షల రూపాయలు) అవసరమని డాక్టర్లు చెప్పారు. మిశ్రా తీగలకుంటపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు. జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
మిశ్రాకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కావున, మిశ్రా సర్జరీకి అయ్యే ఖర్చును ఎల్ వో సి ద్వారా ప్రభుత్వం సహాయం చేయాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను రాజు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు వేముల శ్రీనివాస్ నేత, భూమయ్య, ఏస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.







