మానుగూరు, 14 November
మణుగూరు మండలంలోని సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కలబోయిన మాధవరావు అధ్యక్షతన బాలల గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, బాధ్యతలు, సమాజం పట్ల వారి పాత్రపై అవగాహన కల్పించారు.
అధికారుల సూచనలు
సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉపసర్పంచ్ గాండ్ల సురేష్, ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి జక్కుల అశోక్ కుమార్ మాట్లాడుతూ బాలలందరికీ వారి హక్కులపై అవగాహన ఉండాలని సూచించారు.
బాలల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. విద్య, వైద్యం, సంరక్షణ వంటి అంశాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను తెలియజేశారు.
ప్రతి బాలుడు విద్యను అభ్యసిస్తూ ఆరోగ్యంగా ఎదగాలని, తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. బాలల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి గ్రామస్థాయిలో కృషి చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు వేల్పుల నరేష్, మాదాడి రాజేష్, కొలపిన్ని మానస, ఉకే కృష్ణవేణి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







